మా అయ్యగారు శ్రీమాన్ పుట్టపర్తి నారాయణాచార్యులవారు కవి..పండితుడు..<విమర్శకుడు..గ్రంధకర్త..సంగీత సాహిత్య నాట్యశాస్త్రాల పారమెరిగినవారు..అంతేకాదు..గొప్పవాగ్గేయకారులు..అధ్భుతమైన కృతికర్త..నిజమైన భక్తిని అనుభవించి..ఆ అనుభవసారాన్నిమంచి మంచి కీర్తనలరూపంలోమనకూ అందజేసిన పరమ భక్తుడువారి కృతులుకడప హైదరాబాదు విజయవాడ విశాఖ పట్నంఆకాశవాణి కేంద్రాలలోగత నాలుగు దశాబ్దాలుగా అలరించాయి..ఆనాళ్ళలో..మంచి సాహిత్యంమంచి సంగీతంమంచి శ్రోతలుమంచి కాలంఅలా అన్నీ అమిరాయిఅమృతాన్ని పంచేఆప్రాభవాన్ని మళ్ళీ అక్షరరూపం లోఅందరికీ అందించాలనీఅనుభూతితో పాడే కంఠాల్లోవాని జీవత్వాన్ని మీరూ అనుభవించాలనీఓ చిన్ని ప్రయత్నం..అదే..సరస్వతీపుత్రుని అష్టాక్షరీ పద వైభవం గామీ ముందుకు తెస్తున్నాను..ఇందులోమా అమ్మా అయ్యా ఇద్దరూ వ్రాసినా..అమ్మ అయ్య వెనుకే వుండటానికి ప్రాధాన్యమిచ్చారు.కనుక ఆ తల్లిఆ సరస్వతీపుత్రునిలో సగ భాగంఎన్నడూ విడదీయలేనిదైంది..-పుట్టపర్తి అనూరాధ.
ఈ అష్టా క్షరీ కృతులు సుమారేడువేల వరకున్నవి ఇవి వ్రాసినప్పటి నా మానసిక స్థితి ..అది ఒక గొప్ప అనుభూతి ..వీని రచన 1948-1951 సంతవ్సరముల మధ్య సాగినదని చెప్పవచ్చు ఇవి యెన్నడైనను వెలుగు జూచు నను భావము నాకానాడు లేదు ఆ దృష్టితో వానిని వ్రాయలేదు గూడ వీని రచన నా దృష్టిలో ఒక సాధనా విశేషముగ నడచినది ఈ నాటికొక రెండు నూర్లు కృతులు బయటికి వచ్చినవి తక్కిన వేమగునో తెలియదు ఇవి వెలుగు జూచు విషయములో చాల భాగము పరిశ్రమ మా చిరంజీవి కొండప్ప దన వచ్చును వాడీ కృతులను చాల చోటులలో పాఠము చెప్పి ప్రచారము చేసెను నేటికిని చేయుచునాడు వానికి భగవంతుడు ఆయురారోగ్యములను బ్రసాదించుగాక ముఖ్యముగ యీ ప్రయత్నమునకు దాతలు శ్రీ వల్లంకొండు ఆంజనేయులు గూడూరు శ్రీరాములు శెట్టిగారలు వారిని శ్రీనివాసుడు సంతతము చల్లని చూపుతో చూచుగాక ఈ ప్రయత్నమునకు దోడ్పడిన మరి కొందరున్నారు వారు తమ నామ ధేయమును ప్రకటించుటకంగీకరింపలేదు. నా శిష్యులును కొందరున్నారు.
ఇట్లు
వాగ్గేయకారుడు
పుట్టపర్తి





అష్టాక్షరి పద ధారలు... మునిజన నియమాధారలు...

30, నవంబర్ 2013, శనివారం

యమునా తటిలో తిరిగెడి వాడట


సూర్యుని సంతానం యమున యముడు
యమున కాలస్వరూపం
పోయిన కాలం తిరిగిరాదు
కృష్ణుడు కాలమును శాసించ గలవాడు 
కాలమునకు అతీతుడు 
యమునా తటంలో ఆ కృష్ణుడు విహరిస్తూ వుంటాడు.
ఆ కృష్ణునిపై 
బాలురు మొదలుకొని స్త్రీపురుష భేదం లేకుండా అందరికీ ఎదో తెలియని మోహం..
ఎందుకు ..?
ఎవరికి తెలియని చెప్పలేని అర్థం కాని భావన
గోపికలకు వయసుతో సంబంధం లేకుండా 
వాడంటే విపరీతమైన అపేక్ష.
అలాంటి కృష్ణుడు కనబడకపోతే
వెతుక్కుంటున్నారు వారు..
యమునాతటిలో తిరుగుతూ వుంటాడు
వాడిని మీరు చూశారా..?
వారు గొల్ల పడతులు ..అంతకన్నా యేం చెబుతారు?
ఆ అణగని అలకలూ ..
తడబడే నడకలూ ..గుర్తులు చెబుతున్నారు
వాడి కళ్ళు అందంగా వున్నాయని అంటంలేదు
ఆ కళ్ళనుంచే అన్ని అందాలూ పుట్టాయమ్మా ..
అంత అందంగా వుంటాయా కళ్ళు
అలాటి వాడు మీకగపడ్డాడా..?
మీరు చూశారా..?
అంటున్నారు..
మునులు సాక్షాత్కారం కోసం తపస్సు చేస్తుంటారు
వారికే కామనలూ లేవు..
వారు ఎవ్వరికోసమైతే ధ్యానం చేస్తున్నారో ..
వాడే వచ్చి వారి ధ్యానాన్ని భగ్నం చేసి ..
పగలబడి నవ్వుతున్నాడు..
వారు కళ్ళ కెదురుగా నిలిచిన భగవానుని 
తాము ఎవరికోసం ధ్యానం చేస్తున్నారో 
వాడే వీడని గుర్తించలేక 
కనబడ్డ వాణ్ణి కోపగించి
కనబడని వానికై మళ్ళీ ధ్యాన మగ్నులౌతున్నారు..
 
కానీ గోపికలు ..
మునులకు గినులకు ముసుగులు వేసీ 
మురిసెడు వాడమ్మా..
అంటున్నారు..
అదెందుకో తెలియదు గాని 
వారికి కృష్ణుని కన్నా మునులెక్కువ కాదు
అందుకే వారు మునులూ గినులూ..
వాడు అష్టాక్షరీ నాధుడు..
ఇవన్నీ చెప్పింది గోపికలు అనుకుంటున్నారా..
గోపికా భావంతో పుట్టపర్తి చెప్పిన మాటలివి
అవి ఈ రాగాలు పలికాయి ..

 

యమునా తటిలో తిరిగెడి వాడట 
చెలియా చూచితివా 
ఓ చెలియా చూచితివా 

ఆ అణగని అలకలతో 
ఆవుల క్రేపులతో 
ఆ తడబడు నడకలతో 


యమునా తటిలో తిరిగెడి వాడట 
చెలియా చూచితివా 
ఓ చెలియా చూచితివా 

 
ఆ కన్నులలో పుట్టినవమ్మా 
అన్నీ అందాలు 
అందుకే మరులున వెంట బడిన 
మా కందని వాడమ్మా 
వాడు అల్లరి వాడమ్మా 


యమునా తటిలో తిరిగెడి వాడట 
చెలియా చూచితివా 
ఓ చెలియా చూచితివా 


మా మనసులలో వలపులు రేపీ 
మరగిన వాడమ్మా 
ఎంత వెదకినా అగపడ డమ్మా 
కరుగని వాడమ్మా 
వాడు కపటపు వాడమ్మా 


యమునా తటిలో తిరిగెడి వాడట 
చెలియా చూచితివా 
ఓ చెలియా చూచితివా 


మునులకు గినులకు 
ముసుగులు వేసీ 
మురిసేది వాడమ్మా 
మొగిని అష్టా క్షరి మంత్రములోనే 
వేలసేడు వాడమ్మా 
యమునా తటిలో తిరిగెడి వాడట 
చెలియా చూచితివా 
ఓ చెలియా చూచితివా 



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి