కృష్ణునిలా
షష్టికములను చేసి
లీలలు చేసి
అమ్మకు విశ్వరూపం చూపిన అవతారం
ఎక్కడా లేదు
అసలు ఈ పిల్లాడేనా
ఇంత గొప్ప వాడనుకుంది యశోద
అటువంటి యశోద
సకల విశ్వాన్ని చూసింది
చిన్ని కృష్ణుని నోటిలో..
మన్ను తిన్నావా ..
ఏదీ నోరు చూపు..
అమ్మ మన్ను తినంగనే నాకొంటినో
శిశువునో వెర్రినో
నిజంగా నోరు విప్పితే..
సమస్త భువన భాండమంతా గోచరమయ్యింది..
అంత గొప్ప ఆనందాన్ని అనుభవించింది ఆమె
మరుక్షణం విష్ణు మాయ కమ్మేసింది.
వీడా బ్రహ్మం అనుకుంది
ఎంత సౌలభ్యమండీ కృష్ణావతారంలో
ఎంత భక్త సులభుడై నిలిచాడా పరబ్రహ్మ..
ఆ మధుర మంగళ మనోహర రూపాన్ని
పుట్టపర్తి వారు ఎంత అందంగా వర్ణించారో చూడండి..
ఆడుకోరా కృష్ణా..
ఆడుకో..
కాలమను సూత్రాన గట్టి బ్రహ్మాండమ్ము
మేలైన రతనాల మేటి గిలకల బండి
ఆడుకోరా కృష్ణా..
ఆడుకో..
వాడ వాడల తిరుగ వద్దురా నా తండ్రి..
ఆడుకోరా కృష్ణా ఆడుకో..
మనుజ తనువుల బోలు మట్టి గురిగెలయందు
మాటికిని చైతన్య మట్టి పాలను నింపి..
ఆడుకోరా కృష్ణా..
ఆడుకో..
మాయ బోలిన యమున మధురముగ ప్రవహింప..
ఆ యమున నీడలో అల్లనల్లజూచి..
ఆడుకోరా కృష్ణా..
ఆడుకో..
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి